Sunday, April 19, 2015

పప్పా ఫిలింగ్స్

పుట్టిన ముడు గంటల తరువాత హాస్పిటల్ లో చూసిన అప్పటికె చిన్న చిన్న కళ్లతోని రెప్ప కోట్టకుంట అట్లే చుస్తుంది.......తెల్వకుండనే మొహంల నవ్వు ..మనుసు నిండా చెప్పలేని ఆనందం...జస్ట్ జర సేపు అట్లే చూసిన ...అంచే ఆ చూపులు ఇప్పటికి గుర్తున్నయ్....ఆ ఫోటో  తిసిన ఆ చూపులు  ..పిచ్చి పట్టినట్టలు అందరికి ఆ ఫోటో చూపిస్తనే ఉన్న...ఓ వారం రోజుల దాక........ ఆ వారం రోజులు హని పక్కనే ఉన్న ..జరంత సేపు పక్కకు పోయిన మల్లా జల్దీ పోయి హని ని చూడాలె....ఇట్లే గడిచింది ఆ వారం రోజులు....రెండో  రోజు శ్రీ నేను రాత్రి పూట హనిని విడియె తిస్తున్నం.. చెతులు అటు ఇటు ఆడిస్తుంది....బయట ఎదో హరన్ సౌండ్ అయింది ...హని నవ్వింది...హని ఫస్ట్ స్మైల్ అదే...ఆ విడియో దోస్తులకు ..ఇంట్లోల్లందరికి చూపిచ్చుకుంట నేను  నా మనుసుల నవ్వుతనే ఉన్న......
హని పుట్టినప్పుడు ...అంటె ఆపరెషన్ చెసి బయటకు తిసినప్పుడు...వ్యా...వ్యా అని ఎడుస్తూ ఓ సారి ఆ సౌండ్ లో ఆపరెషన్ తియెటర్ల ఉన్నోల్లకు అమ్మ ...అమ్మా ....అని వినిపిచ్చిందట...నెను హాస్పిటల్ కు రాంగనే నర్స్ లు అదె చెప్తున్నరు...నీ బిడ్డ పుట్టంగనే అమ్మ అన్నదని నవ్వుకుంట చెప్పిండ్రు..... తరువాత హని ఎడిస్తే లా...లా ...............లా      .............లా ..........అని వినిపిచ్చేది...ఎందుకో కొన్ని రోజులకు అది పోయి మాములుగా అయిపోయింది..... 

హని ని వాల్ల అమ్మమ్మ ఇంటికి పంపిచ్చెటప్పుడు శ్రీ కి నెను చెప్పినన్ని సూచనలు , ఇచ్చినన్ని వార్నింగ్ లు ఎవ్వరు ఇచ్చి ఉండరు....అయినా ఎందుకో నెనె దగ్గరుండి చూసుకోవాలనుకున్నా కాని ...బాగుండదని మొత్తానికి వచ్చిన...అదెదో పురుడు అప్పుడు కూడా నెను దగ్గరుండాలనుకున్న కాని మిస్ అయినా...
21డే తరువాత ఇంటికోచ్చినప్పుడు హని ఆకలైతె...నిద్ర వస్తే మాత్రమె ఎడుస్తుండేది...మిగితా టైమ్ లో చెతులు అటు ఇటు ఉపుకుంట...తల తిప్పకుండ కల్లతో అటు ఇటు చూస్తుండేది...ఎదైన సౌండ్ చెస్తే వెంటనే రియక్షన్ ఇస్తుండే....పోద్దున లెచినంక పాల తాగి జర సేపు సైలెంట్ గా ఉండేది...తరువాత నిద్ర రాంగనే ఎడుపు స్టార్ట్ అయ్యెది... అప్పుడు నేను నా చెతుల మీద ఎత్తుకోని అటు ఇటు తిరిగితె కొద్ది సేపటికే నిద్ర పోతుండె...